జాతీయ క్రీడల్లో పతకాలు సాధించిన టీ విజేతలకు కేసీఆర్ అభినందన...!

శుక్రవారం, 6 ఫిబ్రవరి 2015 (09:35 IST)
కేరళలో జరుగుతున్న 35వ జాతీయ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన తెలంగాణ క్రీడాకారులకు రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖరరావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. అందులో రాష్ట్రంలో క్రీడాకారులకు తమవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని కేసీఆర్ హామీ ఇచ్చారు. 
 
ఈ పోటీల్లో రోయింగ్ విభాగంలో స్వర్ణ పతకాలు సాధించిన మంజీద్‌సింగ్, దేవేందర్ సింగ్, అస్రార్ పాటిల్‌లతోపాటు ఐదు వెండి పతకాలు, ఒక కాంస్య పతకాన్ని గెలుచుకున్న క్రీడాకారులను ఆయన అభినందించారు. జాతీయస్థాయి క్రీడల్లో తెలంగాణ ఆటగాళ్లు రాణించటంపట్ల ఆయన ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ క్రీడల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర క్రీడాకారులు ఒక బంగారు పతకం, ఒక సిల్వర్ పతకం, నాలుగు కాంస్య పతకాలను మాత్రమే సాధించ గలిగారు. 

వెబ్దునియా పై చదవండి