అయితే, కేసీఆర్ ప్రభుత్వాన్ని కోర్టు తప్పుబట్టడం ఇది మొదటిసారేమీ కాదని టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టే విధానాలు సరికావని కోర్టులు కేసీఆర్ సర్కారుకు గుర్తుచేస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తోందనడానికి హైకోర్టు వ్యాఖ్యలే నిదర్శనమని పొన్నాల తెలిపారు.