కేసీఆర్‌ను పోతులూరితో పోల్చిన మధుసూదనాచారి!

మంగళవారం, 4 నవంబరు 2014 (11:37 IST)
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారిలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా భవిష్యత్తును ఊహించగలరని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి వ్యాఖ్యానించారు. తద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తనకున్న స్వామి భక్తిని చాటుకున్నారు.
 
తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని కేసీఆర్ ముందే చెప్పారని... అదే జరిగిందని చెప్పారు. కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామంలో ఉన్ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో జరిగిన ఉత్సవాలను మధుసూదనాచారి హాజరయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యలు చేశారు.

వెబ్దునియా పై చదవండి