ఆ మూడు భవనాలలో ఒకటి బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 10లో బంజారా భవన్, రెండోది ఆదివాసీ భవన్, మూడోది బాబూ జగ్జీవన్‌రామ్ భవన్ అని తెలిపింది. ఆ భవనాల నిర్మాణానికి స్థలాన్ని, నిధులను కేటాయించింది.
ఈ మేరకు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఒక్కొక్క భవనాన్ని ఒక్కో ఎకరం విస్తీర్ణంలో నిర్మిస్తారు. ఇందుకోసం స్థలాన్ని, ఒక్కో భవనానికి రెండున్నర కోట్ల రూపాయలను కేటాయిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన ఫైలుపై సంతకాలు పూర్తయినట్లు సమాచారం.