ఎన్నికల నిర్వహణలో ఆలస్యమేల... హైకోర్టు ఆగ్రహం...!

మంగళవారం, 3 ఫిబ్రవరి 2015 (09:39 IST)
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఆలస్యం చేస్తుండడంపై తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణపై అశ్రద్ధ ఎందుకని హైకోర్టు ప్రశ్నించింది. ఈ ఎన్నికల నిర్వహణ ఆలస్యంపై దాఖలైన పిటీషన్‌పై హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. 
 
ఎన్నికల నిర్వహణ పై తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కోర్టు మండిపడింది. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్యంలో మూలస్తంభాలని అటువంటి సంస్థలను నిర్వీర్యం చేయడం తగదని కోర్టు హితవు పలికింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించిన కోర్టు ప్రభుత్వం రాజ్యాంగవిరుద్ధంగా వ్యవహరించవద్దని మందలించింది. వచ్చే వారం ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిపై తేదీలతో సహా కోర్టు అఫిడవిట్‌ దాఖలు చేయాలని తెలంగాణ ఏజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వెబ్దునియా పై చదవండి