అదేసమయంలో ఆటో డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ పథకం వల్ల తమ జీవనోపాధిపోయిందని అల్లాడుతున్నారు. ఆటోల్లో ప్రయాణించేది అత్యధికంగా మహిళలేనని, అలాంటి మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తే ఆటోలు ఎవరు ఎక్కుతారని వారు ప్రశ్నిస్తున్నారు. పైగా, అనేక ప్రాంతాల్లో ఆందోళనలకు కూడా దిగుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా పలువురు ఆటో డ్రైవర్లు ఆర్టీసీ బస్సుల్లో మహిళల వద్దే భిక్షం అడుక్కుంటూ తమ నిరసన తెలియజేశారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంతో ఆటో డ్రైవర్ల బ్రతుకుతెరువు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తూ, మేడ్చల్‌లో ఆటో డ్రైవర్లు బిక్షం అడుక్కుంటూ నిరసన తెలిపారు.