ఒక మహిళగా అటువంటి అజ్ఞానాన్ని చూడటంం భయంకరంగా ఉంది : స్మృతిపై కవిత ఫైర్

శుక్రవారం, 15 డిశెంబరు 2023 (14:18 IST)
మహిళలకు వచ్చే నెలసరి చక్రం (రుతుక్రమం) వైకల్యం కాదని, అందువల్ల ఆ సమయంలో మహిళలకు వేతనంతో కూడిన సెలవు అక్కర్లేంటూ తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై పలువురు విపక్ష మహిళా ఎంపీలు మండపడుతున్నారు. తాజాగా భారాస ఎమ్మెల్యే కె.కవిత కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళగా అటువంటి అజ్ఞానాన్ని చూడటం భయంకరంగా అనిపిస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రుతుక్రమంపై మహిళల పోరాటాలు, ప్రయాణాలకు ఓదార్పు దక్కలేదన్నారు. రుతుక్రమంపై మహిళల పోరాటాలు సముచితమైనవని, దీనిపై చర్చ అక్కర్లేదని ఆమె పేర్కొన్నారు. 
 
రుతుక్రమం ఒక చాయిస్ కాదని, జీవ వాస్తవికమని గుర్తించాలని సూచించారు. వేతనంతో కూడిన సెలవు అక్కర్లేదని తిరస్కరించడమంటే అసంఖ్యాకమైన స్త్రీలు అనుభవించే నిజమైన బాధను విస్మరించినట్టేనని వ్యాఖ్యానించారు. మహిళలు ఎదుర్కొంటున్న పోరాటం, చేస్తున్న వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం ఒక మహిళగా విస్తుగొల్పుతుందని మండిపడ్డారు. విధాన రూపకల్పన, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించాల్సిన సమయం ఇదేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా కవిత ట్వీట్ చేశారు. 
 
మరణం అంచులకు వెళ్లిన వచ్చిన మహిళకు మానసిక ప్రశాంత.. ఎలా?  
 
సాధారణంగా మనిషి నుంచి ప్రాణం పోయిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. కానీ, మరణం అంచులకు వెళ్లి వచ్చిన ఓ మహిళకు మాత్రం మానసిక ప్రశాంత లభించిందని చెబుతుంది. ఈ విషయాలను ఆమెను పంచుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
అమెరికాకు చెందిన లారెన్ కెనెడే అనే మహిళ గత యేడాది అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్టుతో కుప్పుకూలిపోయింది. ఆమె భర్త వెంటనే అత్యవసర మెడికల్ సిబ్బందికి సమాధానం ఇచ్చి ఆమెకు సీపీఆర్ నిర్వహించాడు. ఈలోపు అత్యవసర సిబ్బంది వచ్చి ఆమెకు దాదాపు 24 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆమె మళ్లీ ఈలోకంలోకి వచ్చేలా చేశారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు కోమాలో ఉన్నాక ఆమె స్పృహలోకి వచ్చింది. కానీ, అంతకుముందు వారం పాటు జరిగిన విషయాలన్నీ తన మెదడులోంచి తుడిచిపెట్టుకుపోయాయని ఆమె చెప్పుకొచ్చింది. 
 
కార్డియాక్ అరెస్టుతో గుండె కొట్టుకోవడం ఆగిపోయిన వారికి తొలి పది నిమిషాలు చాలా కీలకం. ఆ సమయంలో వెంటనే సీపీఆర్ చేస్తే వారు మళ్లీ కోలుకునే అవకాశాలు మెండుగా ఉంటాయి. కానీ, తాజా ఘటనలో మహిళకు 24 నిమిషాల పాటు సీపీఆర్ చేశాక ఆమె మళ్లీ స్పృహలోకి వచ్చింది. 'ఆ తర్వా నన్ను ఆసుపత్రిలో ఉంచారు. రెండు రోజుల పాటు కోమాలో ఉన్నా. స్పృహలోకి వచ్చే సరికి అనేక విషయాలు మర్చపోయా. అంతకుమునుపు వారంలో జరిగిన విషయాలేవీ గుర్తులేవు. కానీ మనసంతా ప్రశాంతత ఆవరించింది. ఆ భావన చాలాకాలం పాటు అలాగే కొనసాగింది' అని ఆమె వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు