నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

ఠాగూర్

శుక్రవారం, 25 జులై 2025 (15:09 IST)
ఓ వ్యక్తి నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ఇంటి ప్రహరీ గోడపైకి ఎక్కించాడు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
శంభీపూర్ అనే గ్రామంలో నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ డ్రైవర్ కారును ఇంటిగోడపైకి ఎక్కించారు. ప్రమాదం జరిగిన సమయంలో భారీ శబ్దం రావడంతో ఇంటి యజమాని నిద్రలేచి బయటకు వచ్చి చూడగా ఇంటి కనిపించిన దృశ్యం చూసి నివ్వెరపోయాడు. 
 
దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో వెంటనే ప్రమాదస్థిలికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు క్రేన్ సాయంతో కారును కిందికి దించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

 

నిద్రమత్తులో ఇంటిగోడపైకి కారు ఎక్కించిన వ్యక్తి

మేడ్చల్ - దుండిగల్ పియస్ పరిదలోని శంభీపూర్‌లో కారు బీభత్సం

కారును క్రేన్ సహాయంతో దింపిన ట్రాఫిక్ పోలీసులు pic.twitter.com/PZUcNw0KW7

— Telugu Scribe (@TeluguScribe) July 25, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు