Case filed against BRS MLA Padi Kaushik Reddy: బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆయనతో పాటు 20 బీఆర్‌ఎస్ నేతలపై సైతం కేసు నమోదైంది. విధులను ఆటంకం కలిగించడన్ని బెదిరింపులకు పాల్పడాన్నిఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కౌశిక్ రెడ్డి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసేందుకు వెళ్లారు. ఆయన వచ్చే సమయానికి సీఐ బయటకు వెళ్తున్నారు. అయితే తన ఫిర్యాదును స్వీకరించిన తర్వాత వెళ్లాలని కౌశిక్ రెడ్డి కోరారు. తాను ఓ స్నేహితుడి పార్టీకి వెళితే శివధర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేసి.. అక్కడికి పోలీసులను పంపారని.. నా దగ్గర డ్రగ్స్ పెట్టించి కేసు పెట్టించాలని శివధర్ రెడ్డి ప్రయత్నించారన్నారు. సీఎం రేవంత్, శివధర్రెడ్డిపై కేసు నమోదు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ కౌశిక్ రెడ్డి చేశారు.