తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం భేటీ అయ్యారు. ఈ సంద్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధిపై చర్చించారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కూడా పాల్గొన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఆర్థిక సలహాదారుగా రఘరామ రాజన్ వ్యవహరించారు.
కాగా, తన నివాసానికి వచ్చిన రఘురాం రాజన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ముందుగా శాలువాతో సత్కరించారు. భట్టి, శ్రీధర్ బాబులతో కలిసి బొకేతో రాజన్‌ను స్వాగతించారు. ఆ తర్వాత రాష్ట్రంలో ఆర్థిక సమస్యలపై చర్చించినట్టు సమాచారం. నిధుల సమీకరణకు అనుసరించాల్సిన విధి విధానాలపై రఘురాం రాజన్ సూచనలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశంలో సీఎం, ముత్రులతో పాటు ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ఫైనాన్స్ స్పెషల్ సెక్రటరీ రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి తదితరులు ఆరోపించారు.