మహానంది ఆలయానికి సామాన్య భక్తుడి రూ.2కోట్ల విలువైన భారీ విరాళం (video)

సెల్వి

శనివారం, 26 అక్టోబరు 2024 (12:54 IST)
mahanandi
శ్రీశైలం ఆలయానికి వెళ్లిన భక్తులు.. మహానంది ఆలయానికి కూడా వెళ్లటం పరిపాటి. అయితే తాజాగా మహానంది ఆలయానికి భారీ విరాళం అందింది. మహానంది ఆలయానికి ఓ రిటైర్డ్ లెక్చరర్ భారీ విరాళం అందజేశారు. 
 
భక్తుడైన ఆ రిటైర్డ్ లెక్చరర్.. మహానందికి రూ.2కోట్లకు పైగా విలువైన ఆస్తులను విరాళంగా అందజేశారు. మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన రాజు, శకుంతల అనే దంపతులు ఈ విరాళాన్ని మహానందికి ప్రకటించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. 
 
ఈ విరాళాల కింద మహానంది ఆలయానికి 2.10 ఎకరాల భూమిని, ఐదు సెంట్లలో కట్టిన ఇంటిని అందజేశారు. గురువారం దేవస్థానం ఈవో చేతికి ఈ ఆస్తులకు చెందిన పత్రాలను దంపతులు ఇద్దరూ అందజేశారు. మహానంది ఆలయం అభివృద్ధి కోసం రాజు గతంలోనూ విరాళాలు అందించారు. 

నంద్యాల....మహానంది ఆలయంకు భారీ విరాళం
రెండు కోట్ల విలువైన 2 ఎకరాల10 సెంట్ల భూమి,ఇంటిని దేవాలయంకు రాసి ఇచ్చిన ‌భక్తుడు
రిటైర్డ్ లెక్చరర్ రాజు దాతృత్వం పై ప్రశంసల వెల్లువ
దాత రాజు,శకుంతల దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి సన్మానించిన ఈఓ శ్రీనివాస రెడ్డి.#kurnool #Mahanandi #RTV pic.twitter.com/ZfkejjXWfF

— RTV (@RTVnewsnetwork) October 25, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు