మద్యం సేవించిన ఒక జిమ్ ట్రైనర్.. గంటకు 130 కిలోమీట్లకు పైగా వేగంతో ఒక ఖరీదైన సెడాన్ కారును నడుపుతూ ఆగి వున్న ఎలక్ట్రిక్ బైకును ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మరణించగా, ఒక పాదచారి గాయపడ్డాడు. ఈ ఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది.
బాధితులు, 20 ఏళ్ల కంచర్ల శివ, నాకిరేకంటి సందీప్ కుమార్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ స్టేషన్ ముందు డివైడర్ వద్ద తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై నిలబడి ఉన్నారు. ఈ టూవీలర్‌ను కారు ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు.
పెట్రోల్ బంక్ నుండి రోడ్డు దాటుతున్న 23 ఏళ్ల సబావత్ శ్రీధర్ అనే మరో పాదచారి కూడా గాయపడ్డారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో జిమ్ ట్రైనర్ రక్తంలో 160 బీఏసీ ఉన్నట్లు తేలింది. కారును స్వాధీనం చేసుకుని, అతడిని అదుపులోకి తీసుకున్నారు.