రాబోయే రెండు రోజులు, హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణలోని అనేక జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశాన్ని సూచిస్తుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలతో పాటు సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతారణ పరిస్థితులు ఉన్నాయి. పగలు భగ భగ మండే ఎండలు చుక్కలు చూపిస్తుంటే.. సాయంత్రం అయ్యే సరికి కుండపోత వర్షం కురుస్తోంది. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు.