తమ కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటుగా బ్రాండ్ యొక్క చిత్తశుద్ధిని చూపే నిర్ణయాత్మక చర్యగా, పియాజియో ఇండియా నిర్మల్‌లో నకిలీ పియాజియో విడిభాగాల ఉత్పత్తి, పంపిణీకి వ్యతిరేకంగా భారీ స్థాయిలో చట్టపరమైన దాడులను నిర్వహించింది. వినియోగదారుల భద్రత, ఉత్పత్తి విశ్వసనీయత ప్రధాన ప్రాధాన్యతలతో, పియాజియో కఠినమైన చట్టపరమైన చర్యల ద్వారా నకిలీ విడిభాగాల సమస్యపై చురుకుగా పోరాడుతోంది. ఇటీవల నిర్మల్‌లో జరిగిన దాడిలో 70కి పైగా అనధికార విడిభాగాలు, ఉపకరణాలు, నకిలీ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ విషయంపై పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్పేర్ పార్ట్స్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మలింద్ కపూర్ మాట్లాడుతూ, “మేము భారతదేశంలోని చట్టాలను అమలు చేసే సంస్థలతో కలిసి పని చేస్తున్నాము. వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యత నివ్వడమే కాకుండా తమ కార్యకలాపాల వల్ల ఎదురయ్యే సంభావ్య చట్టపరమైన పరిణామాలు గురించి నకిలీ వ్యాపారులకు గట్టి హెచ్చరిక కూడా చేస్తున్నాము. పియాజియో ఒరిజినల్ స్పేర్ పార్ట్‌లను అధీకృత/పంపిణీదారు/డీలర్‌షిప్/షాప్/రిటైలర్ నుండి మాత్రమే కొనుగోలు చేయగలరు. అత్యధిక నాణ్యత, సేవలను పొందగలమనే భరోసా పొందేందుకు అధీకృత దుకాణాల నుండి మాత్రమే కొనుగోలు చేయాలని మేము మా కస్టమర్‌లను కోరుతున్నాము" అని అన్నారు.