నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన జీరో ధర టిక్కెట్ పైన ఓ ప్రయాణికురాలు విమర్శనాస్త్రాలు సంధించారు. ఉచిత బస్సు ప్రయాణం అవకాశం కల్పించడంపై తను చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఉచితాలు ఇచ్చి ఆ భారాన్ని ఎవరిపై వేస్తారు అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేస్తారా అంటూ ప్రశ్నించారు.
స్త్రీలకు రూ.2500 ప్రతి నెలా ఉచితంగా ఎందుకు ఇవ్వాలి? ఇలా అన్నీ ఉచితాలు ఇస్తూ పోతూ వుంటే ప్రజల్లో బద్ధకం పెరిగిపోతుంది. కష్టపడరు, రాష్ట్రం అప్పులపాలవుతుంది. అప్పుడు ఆ భారం ఎవరిపై పడుతుంది. ఇదంతా ఆలోచించాలి అంటూ ఆమె చెప్పుకొచ్చారు.