కుక్కల దాడిలో బాలుడు మృతి.. విచారం వ్యక్తం చేసిన సీఎం రేవంత్\

వరుణ్

బుధవారం, 17 జులై 2024 (12:58 IST)
హైదరాబాద్ నగరంలో జరిగిన కుక్కల దాడిలో ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి మృతి కలచివేసిందని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశిం్చారు. వీధి కుక్కల దాడిపై ఫిర్యాదుకు ఒక టోల్ ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలని కోరారు. పశు వైద్యులు, బ్లూక్రాస్ వంటి సంస్థల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు. కుక్కకాటుకు అన్ని ఆస్పత్రుల్లో తక్షణం వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. శునకాల నియంత్రణలో ఇతర రాష్ట్రాల పద్ధతులను పరిశీలించాలన్నారు. జవహర్‌నగర్‌లో వీధికుక్కల దాడిలో 18 నెలల చిన్నారి మృతి చెందిన విషయం తెలిసిందే. 
 
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి....
 
తెలుగు రాష్ట్రాల్లో నానాటికీ వీధి కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. ఈ శునకాలు దాడిలో అనేక మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దాడులు రోజూ రోజుకు పెరుగుతున్నాయి. అయితే, అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. తాజాగా వీధి కుక్కల దాడిలో ఒక బాలుడు మృతి.. మరో బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. 
 
హైదరాబాద్, జవహర్ నగర్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో విహాన్(2) అనే బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసి, విహాన్ నెత్తి భాగాన్ని పీక్కు తినడంతో జుట్టు, చర్మం ఊడి నేలపై పడ్డాయి.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ విహాన్ మృతి చెందాడు. జగిత్యాల - బీర్పూర్ మండలం మంగెలలో ఇంటి బయట ఆడుకుంటున్న దేవేందర్(7) అనే బాలుడిపై కుక్క దాడి చేయడంతో తీవ్రగాయాలు అయ్యాయి.. అప్రమత్తమైన కుటుంబసభ్యులు బాలుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు