రాజ్ తారుణ్, లావణ్య ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ - అందరిని తప్పుదోవపట్టించిన లావణ్య !

డీవీ

మంగళవారం, 16 జులై 2024 (15:33 IST)
Raj Tarun Lavanya, sekar basha
సినీ హీరో రాజ్ తరుణ్, లావణ్య అనే అమ్మాయితో సహజీవనం చేసిన మాట నిజమే. అయితే అసలు లావణ్య క్యారెక్టర్ మంచిదికాదని ఆమె అబద్దాల కోరని, ఆమె డ్రగ్స్ ను అమ్మేదనని.. ఈ విషయంలో కేసు కూడా బుక్ అయిందని రాజ్ తరుణ్ స్నేహితుడు శేఖర్ బాషా తెలియజేస్తున్నాడు. గత కొద్దిరోజులుగా ఛానల్స్ లోనూ, యూ ట్యూబ్ లలో లావణ్య గురించి ఆమె మాట్లాడిన విషయాలను శేఖర్ ఇలా తెలియజేశాడు.
 
అమ్మాయి తనకు అన్యాయం జరిగిందని అనేసరికి పోలీసులు, మీడియా అబ్బాయిపై తెగ నిందలు వేస్తూ రకరకాలుగా చూపిస్తుంటారు. ఆ అమ్మాయి గురించి పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోరు. ఆమె చెబుతుంది నిజమా? కాదా? అని చెక్ చేసుకోరు అని  మండిపడ్డాడు.
 
శేఖర్ మాటల్లో.. డ్రెగ్ సప్లయి చేసే ఉనీత్ రెడ్డి, మస్తాన్ రావ్ (మస్తాన్ సాయి), లావణ్య మంచి స్నేహితులు. ఉనీత్ రెడ్డితో లావణ్య .. దేవదాస్ మళ్లీ పుట్టాడు.. అనే షార్ట్ ఫిలింలో నటించింది. అప్పుడు టైటిల్ లో ఉనీత్ రెడ్డి పేరు చింటుగా వేశారు. లావణ్య పేరు మరో పేరుగా వేసుకుంది. చింటూ నా కోసం ఏదైనా చేస్తాడు అని వీరి ఎఫైర్ గురించి ఓ సారి చెప్పింది కూడా. 
 
ఆ తర్వాత మస్తాన్ రావ్ నుంచి లావణ్య మత్తు పదార్థాలను కొని బయట ఎక్కువ రేటుకు అమ్మేది. ఆ పరిచయంతో ఇద్దరూ ఒకటికూడా అయ్యారు. మస్తాన్ రావు ప్రేమ పేరుతో వెంటబడేవాడు అని కూడా లావణ్య చెప్పింది. అందుకు వ్రూప్ నా దగ్గర వుంది. ఈ ఇష్యూ   ఏప్రిల్ 2023 లో జరిగింది. తరచూ ఇద్దరు కలుస్తుండేవారు. హైదరాబాద్ లో.. తమ అపార్ట్మెంట్ లో కలిసేవారు. కొంత కాలానికి మస్తాన్ రావ్ కూడా వేరే అమ్మాయిలతో ఎఫైర్స్ వున్నాయని లావణ్యకు తెలిసింది. అది గ్రహించిన లావణ్య నిలదీస్తే ఇద్దరూ కలిసిన పర్సనల్ వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేశాడు. ఇప్పుడు లావణ్య కూడా రాజ్ తరుణ్  ను అదే రూటులో బ్లాక్ మెయిల్ చేస్తుంది.
 
 గత ఏడాది లావణ్యపై డ్రెగ్ కేసు కూడా బుక్ అయింది. గుంటూరులోని పట్టాభిపురంలో ఎఫ్.ఐ.ఆర్. బుక్బు అయింది. దయచేసి నార్సింగ్ పోలీసులు అక్కడికి వెళ్ళి.. తెలుసుకోండి. ఇలా ఆమె పోలీసులను, ఇటు మీడియాను కూడా తప్పుదోవ పట్టించింది. 
 
ఈ ఏడాది జనవరి నెలాఖరులో నార్సింగ్ ఎస్.ఐ. లక్మీనారాయణ,. లావణ్య పై  22 బి. కేసు పెట్టారు. ఆమె దగ్గర నాలుగు గ్రాముల కొకైన్ దొరికింది. తనకు ఆదాయం సరిపోకపోవడంతో ఇలా చేస్తున్నానని చెప్పింది. అప్పుడు నలుగురు పెద్దలు పంచాయితీ కూడా చేశారు అంటూ.. శేఖర్ తన ఫోన్ లో అప్పటి కేసు వివరాలు చూపించాడు. ఏది ఏమైనా మీడియా, పోలీసులు ఇలాంటి వారిపట్ల జాగరూకతో వుండాలి. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకుని నడవాలంటూ... తెలిపారు. మరి రాజ్ తరుణ్ కేసు ఇంకా ఎంతవరకు వెళుతుందో చూడాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు