ఆమె తరఫు న్యాయవాది గుర్మీత్ సింగ్ ప్రత్యేక జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఫస్ట్ క్లాస్ కోర్టు ముందు ఆమె ప్రత్యుత్తరాన్ని దాఖలు చేశారు. దీంతో తదుపరి విచారణ కోసం ఈ కేసును అక్టోబర్ 30కి కోర్టు వాయిదా వేసింది.
మంత్రి వ్యాఖ్యలు తన కుటుంబ గౌరవం, ప్రతిష్టను దెబ్బతీసేలా ఉన్నాయని నాగార్జున కోర్టుకు తెలిపారు. మంత్రి తన కుటుంబం గురించి, ముఖ్యంగా తన కొడుకు విడాకుల విషయంలో అగౌరవంగా వ్యాఖ్యలు చేశారని నాగార్జున పేర్కొన్నారు.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో చేసిన కృషి, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా తన కుటుంబ ప్రతిష్టను దిగజార్చాయని నాగ్ అన్నారు. దీంతో కొండా సురేఖపై బీఎన్ఎస్ సెక్షన్ 356 ప్రకారం మంత్రిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.