రూ. 4000 పెన్షన్ కావాలా? ఐతే ఈ పని చేయాలంటున్న రేవంత్ సర్కార్

బుధవారం, 27 డిశెంబరు 2023 (14:09 IST)
తెలంగాణలో ఏర్పడ్డ కొత్త సర్కార్ తాము ఇచ్చిన 6 గ్యారెంటీలను నెరవేర్చేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా అర్హులైనవారికి చేయూత పథకం కింద రూ. 4000 ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకుగాను అర్హులైనవారు దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది.
 
డిశెంబరు 28 నుంచి జనవరి 6 వరకూ రేవంత్ సర్కార్ నిర్వహించే ప్రజాపాలనలో అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచన చేసింది. ఐతే ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు తిరిగి మళ్లీ చేసుకోవాల్సిన అవసరం లేదని తెలియజేసింది. అలాగే ప్రస్తుతం పెన్షన్ పొందుతున్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.

ప్రజా పాలన - Praja Palana
28.12.2023 06.01.2024

ప్రజా పాలన దరఖాస్తు:
(మహాలక్ష్మి / రైతు భరోసా / గృహ జ్యోతి / ఇందిరమ్మ ఇండ్లు / చేయూత పథకముల కొరకు)

Public Palana Application:
(For Mahalakshmi / Rythu Bharosa / Gruha Jyothi / Indiramma Houses / Cheyutha Schemes)#PrajaPalanapic.twitter.com/DsMB77jht6

— Congress for Telangana (@Congress4TS) December 27, 2023

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు