నిజానికి ఈ నెల 6, 7 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించాల్సివుంది. ఈ తేదీలను రెండు నెలల క్రితమే ప్రకటించారు. కానీ, ఈ పరీక్షల నిర్వహణకు మరో వారం పదిరోజుల సమయం మాత్రమే ఉన్నప్పటికీ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు జరగలేదు. దీంతో ఈ పరీక్షలు వాయిదా వేసినట్టేనని అభ్యర్థులు పేర్కొంటున్నారు.
కాగా, రాష్ట్రంలోని వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 783 పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ గతేడాది డిసెంబరు నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 5.5 లక్షల మంది నిరుద్యోగులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టులో పరీక్షలు నిర్వహించనున్నట్లు కమిషన్ తొలుత ప్రకటించింది. ఆపై నవంబరుకు, మళ్లీ 2024 జనవరి నెలకి వాయిదా వేసింది. ఇప్పుడు మళ్లీ వాయిదా పడే అవకాశం ఉండడంతో గ్రూప్ 2 పరీక్షలను రీషెడ్యూల్ చేస్తారా లేక రీవైజ్డ్ నోటిఫికేషన్ జారీ చేస్తారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.