తెలంగాణ రాష్ట్రానికి చెందిన జానపద మహిళా గాయని గంగవ్వ యూట్యూబ్ వీడియోలతో పాపులర్ అయ్యారు. బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొని మరింత క్రేజ్‌తో తన ఫాలోయింగ్‌ను కూడా పెంచుకున్నారు. తాజాగా ఆమె సరికొత్త లుక్‌లో కనిపించారు. ఆమె తాజా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయింది. వీటిని చూసిన నెటిజన్లు.. గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజా మేకప్‌తో గంగవ్వకు వృద్ధాప్యం కారణంగా ముఖం మీద వచ్చిన మడతలు తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. గంగవ్వ తాజాగా లుక్‌లోకి మారడంతో అసలు ఆమెకు ఏమైంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా, తాజా లుక్‌లో గంగవ్వ అదుర్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.