హైదరాబాద్ లో ప్రతి ఇంటికి 10,000 ఆర్థిక సహాయం

సోమవారం, 19 అక్టోబరు 2020 (19:02 IST)
భారీ వర్షాలతో అతలాకుతలమైన భాగ్యనగరంలో వరద ప్రభావానికి గురైన వారికి సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం ప్రకటించారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు వెల్లడించారు.

మంగళవారం నుంచే ఈ ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. పూర్తిగా ఇల్లు కూలిపోయిన వారికి పరిహారంగా లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న వారికి రూ.50వేలు చొప్పున అందిస్తామన్నారు.

భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు, మౌలిక సదుపాయాల కల్పనకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నట్లు చెప్పారు. పేదలకు సాయం కోసం పురపాలక శాఖకు రూ.550 కోట్లు తక్షణమే విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు