గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం - వైద్యులకు పాజిటివ్

సోమవారం, 17 జనవరి 2022 (18:37 IST)
సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పంజా విసిరింది. ముఖ్యంగా, ఈ ఆస్పత్రిలో పని చేసే వైద్యుల్లో అనేక మంది ఈ వైరస్ కోరల్లో చిక్కుకున్నారు. తాజాగా లెక్కల ప్రకారం ఏకంగా 120 మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. వీరిలో వైద్యులతో పాటు.. హౌస్ సర్జన్లు, ఎంబీబీఎస్ చదివే విద్యార్థులు కూడా ఉన్నారు. 
 
అదేవిధంగా ఎర్రగడ్డలోని మానసిక చికిత్స వైద్యశాలలో కూడా అనేక మందికి ఈ వైరస్ సోకింది. ఈ మెంటల్ ఆస్పత్రిలో 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్యులతో పాటు.. మరికొంతమంది వైద్య సిబ్బందికి కరోనా వైరస్ సోకినట్టు సమాచారం. 
 
అయితే, కరోనా వైరస్ బారినపడుతున్నవారు మానసిక రోగులు కావడంతో ఆస్పత్రి వైద్యులు కూడా ప్రత్యేక చర్యలు తీసుకుని చికిత్స అందిస్తున్నారు. తెలంగాణాలోని పలు ఆస్పత్రులు, పోలీస్ స్టేషన్లలో పని చేసే సిబ్బంది భారీ సంఖ్యలో కరోనా వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి