తొమ్మిదేళ్ల తర్వాత మహేశ్ పెళ్లి చేసుకోమని అడగ్గా... ఇంట్లో ఎలా ఒప్పిస్తావంటూ ఆమె ప్రశ్నించింది. తాను ఐపీఎస్‌గా సెలెక్ట్ అయితే ఇంట్లో వారి అంగీకారం లభిస్తుందని చెప్పి పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత మహేష్ ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. అప్పుటినుంచి అతని ప్రవర్తనలో మార్పు వచ్చిందని బాధితురాలు వాపోయింది.