తాగుబోతు భర్తతో ఆ సుఖం లేదనీ... ప్రియుడితో కలిసి వివాహిత జంప్

మంగళవారం, 8 అక్టోబరు 2019 (13:54 IST)
అది హైదరాబాద్ నాంపల్లి గాంధీనగర్ లోని ఓ ఇల్లు. తెల్లవారుజామున టెన్షన్‌గా వినయ్ మెట్లు కిందకు దిగుతున్నాడు. అతని చేతికి రక్తం. చుట్టుప్రక్కల వారు చూసి భయంతో పోలీసులకు ఫోన్ చేశారు. వినయ్‌ను పట్టుకుని అతన్ని ఇంటిలో పెట్టి తాళం వేశారు. ఇంతలో వినయ్ అత్తమామలు రామక్రిష్ణ, సరోజమ్మలు అక్కడకు వచ్చారు.
 
నా కూతురు అలేఖ్యను ఏం చేశావురా అంటూ గట్టిగా ఏడుస్తూ వినయ్‌ను కొడుతున్నారు. పోలీసులు ఇంతలో వచ్చారు. ఆగండి అంటూ వినయ్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకెళ్ళారు. వినయ్ మద్యానికి బానిసై తన కూతుర్ని రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడని అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను వినయ్ చంపేసి ఉంటాడని పోలీసులకు చెప్పారు.
 
దీంతో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వినయ్‌ను చితకబాదినా అతనేమీ చెప్పడం లేదు. సర్.. నేను ఫుల్లుగా మద్యం తాగాను. ఆ తరువాత నా భార్యకు, నాకు మధ్య గొడవ జరిగింది. నేను మత్తులో కింద పడిపోయాను. అంతవరకే నాకు గుర్తుంది. నేను నా భార్యను ఏమీ చేయలేదు. దయచేసి నన్ను వదిలేయండి అంటూ చెబుతున్నాడు వినయ్. 
 
ఎస్.ఐ. మరింత కొట్టడంతో నన్ను చంపేయండి అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఎస్.ఐ.కు ఏమీ అర్థం కాలేదు. వినయ్ తన భార్యను హత్య చేసి ఉండడు. ఏదో జరిగింది అని నిర్ధారించుకున్న ఎస్.ఐ... వెంటనే అలేఖ్య ఫోన్‌ను ట్రేస్ చేశారు. అందులో అలేఖ్య ఒక యువకుడితో మాట్లాడటం విన్నాడు. 
 
ఇది ఎవరి వాయిస్ అంటూ వినయ్‌ను అడిగాడు. ఇది అలేఖ్య వాయిస్. అయితే అటువైపు మాట్లాడుతున్న యువకుడి వాయిస్ నాకు తెలియదన్నాడు వినయ్. ఫోన్ నెంబర్ ఆధారంగా అది పుణేలోని అభినవ్ అనే యువకుడిదని నిర్ధారించుకున్నారు. పోలీసులు అభినవ్‌ను అరెస్టు చేశారు. అభినవ్‌తోనే అలేఖ్య కూడా ఉంది.
 
ఎం.బి.ఎ. చేసేటప్పుడు అలేఖ్యకు అభినవ్ మంచి స్నేహితుడు. వివాహమైన తరువాత కూడా అభినవ్‌తో అలేఖ్య మాట్లాడుతూ ఉండేది. అయితే భర్త పెట్టే టార్చర్ తట్టుకోలేక అభినవ్‌తో వెళ్ళిపోవాలనుకుని నిర్ణయించుకుంది. దీంతో భర్తకు ఫుల్లుగా మద్యం తాగించి కొత్తగా కొనుక్కొచ్చిన సిరంజ్‌తో తన రక్తాన్ని తీసి అతని చేతిలో వేసి ఇల్లు మొత్తం చల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు అలేఖ్య పోలీసుల విచారణలో తెలిపింది. దీంతో పోలీసులు అభినవ్‌ను పుణేకు పంపించి వినయ్, అలేఖ్యలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు