భార్య మాట వినడం లేదనీ... వ్యభిచారిణిగా నెట్టింట్లో భర్త ప్రచారం

ఆదివారం, 6 అక్టోబరు 2019 (13:21 IST)
కట్టుకున్న భార్య తన మాట వినడం లేదనీ భావించిన ఓ భర్త... భార్యను వ్యభిచారణిగా ప్రచారంగా చేశారు. అంతేనా.. ఆమె ఫోటో పెట్టి దానికింద అసభ్యకర కామెంట్స్‌ను పోస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు నిందితుడు శనివారం అరెస్టు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జవహర్ నగర్ పీఎస్ పరిధిలోని దమ్మాయిగూడ లక్ష్మినగరులో జాన్‌జార్జి అలియాస్ సన్నీ(30) దంపతులు ఉంటున్నారు. రాధిక థియేటర్‌లో సన్నీ ప్రొజెక్టర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. 
 
ఇటీవల సన్నీ భార్య ఆఫీసు నుంచి ఆలస్యంగా రాసాగింది. దీంతో ఆమెతో సన్నీ గొడవపడ్డాడు. ఆఫీసులో టీం లీడర్‌తో మీటింగ్ ఉంటోందని అందుకే ఆలస్యమవుతోందని భార్య చెప్పినా ఆమె మాటలు భర్త పట్టించుకోలేదు. 
 
భార్య చెప్పిన మాట వినడం లేదని సన్నీ ఆమెపై కోపంపెంచుకున్నాడు. భార్యపై కోపంతో సన్నీ సెప్టెంబరు 23వ తేదీన ఆమె స్నేహితురాలు, ఆఫీసులో టీం లీడర్ అయిన మహిళ ఫోటోలతో షేర్ చాట్‌లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేశాడు. 
 
కాల్‌గర్ల్ అంటూ ఆమె ఫోన్ నంబర్ పోస్ట్ చేశాడు. తరచుగా ఆ మహిళకు ఫోన్ కాల్స్ రావడంతో ఆందోళన చెందిన ఆమె గురువారం రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైం పోలీసులు షేర్ చాట్ ఐడీ ద్వారా నిందితుడు సన్నీని గుర్తించి శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని రిమాండ్‌కి తరలించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు