అత్త, భర్త వేధిస్తున్నారా...? రండి నావద్దకు, 300 మంది యువతులను...

బుధవారం, 4 జనవరి 2017 (16:18 IST)
అతడు విక్టర్ అని పేరు పెట్టుకున్నాడు. ఐతే ఆ పేరుకు మరో అర్థం వుందని అతడు చేష్టలు చెప్పేసాయి. వివరాల్లోకి వెళితే... హైదరాబాదులో పీడిత మహిళలు.. అంటే అత్తింటి వేధింపులు, భర్తతో వేధింపులకు గురవుతున్నవారి కోసం కౌన్సిలింగ్ సెంటర్ అంటూ ఒకటి ఓపెన్ చేశాడు విక్టర్. వేధింపులకు గురవుతున్న మహిళలకు సాయం చేస్తానంటూ ప్రకటనలు గుప్పించాడు. 
 
వేధింపులు తాళలేని కొందరు మహిళలు నిజంగా అతడు తమ బాధల పరిష్కారిని మార్గం చూపుతాడని వెళ్లేవారు. అలా వచ్చిన వారి దగ్గర్నుంచి ఫ్యామిలీ సీక్రెట్స్ రాబట్టేవాడు. ఇక అవే అతడికి ఆయుధాలు. వాటిని అడ్డం పెట్టుకుని మహిళలను బ్లాక్ మెయిల్ చేసి వారిని లొంగదీసుకునేవాడు. ఇలా దాదాపు 300 మంది యువతులను అతడు మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇతడి వేధింపులు తాళలేని కొందరు మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటపడింది.

వెబ్దునియా పై చదవండి