నన్ను వెతకొద్దు, నా ప్రియుడిని పెళ్లాడా, ఇవిగో ఫోటోలు

బుధవారం, 11 మార్చి 2020 (16:24 IST)
వరంగల్ రూరల్ నల్ల మండలం రుద్రగూడెం ఆశ్రమ పాఠశాల నుండి అదృశ్యమైన 14 ఏళ్ల మైనర్ బాలిక అంజలి తన ప్రియుడిని వివాహం చేసుకున్నాట్టు సోషల్ మీడియాలో తెలియజేసింది. 7వ తేదీన అదృశ్యమైన బాలిక దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన వరప్రసాద్ అనే మైనర్ బాలుడిని వివాహం చేసుకుంది.
 
అంజలి స్వగ్రామం ములుగు మండలం కోడిశాలకుంట గ్రామం.. గత కొన్ని రోజులుగా తమ బాలిక కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లిదండ్రులు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

తాజాగా తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోల ద్వారా మైనర్ బాలిక అంజలి తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు