కానిస్టేబుల్ కదా అని పాపం మహిళ లిఫ్ట్ ఇచ్చింది... అంతే,

ఆదివారం, 12 జులై 2020 (22:21 IST)
హైదరాబాదులో లిఫ్ట్ ఇచ్చిన మహిళను వేధించిన ఘటనలో వీరబాబు అనే కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు బంజారాహిల్స్ పోలీసులు. కారులో వెళుతున్న మహిళను కానిస్టేబుల్ కారు ఆపి లిఫ్ట్ అడిగాడు. అడిగింది పోలీస్ కావడంతో సదరు మహిళ ఎక్కడ దింపాలి అని అడిగింది.
 
సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గిర పని వుందని అక్కడ దించమని అడగడంతో ఆమె కానిస్టేబుల్ వీరబాబు అక్కడ దించింది. కారు దిగిన తరువాత ఆమె నెంబర్ తీసుకొని మరుసటి రోజు నుంచి మహిళకు ఫోన్లు, వాట్సప్ మెసేజ్‌లతో వేధింపులకు గురిచేశాడు వీరబాబు. దీంతో బంజారాహిల్స్ పోలీసులకి ఫిర్యాదు చేసింది బాధితురాలు.
 
కానిస్టేబుల్ వేధింపులు పోలీసులకు ఆధారాలతో సహా సదరు మహిళ చూపించడంతో 
కానిస్టేబుల్ వీరబాబుపై ఐపీసీ 354, 509 సెక్టన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు