తన సిబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన ఆయన.. కరోనా బాధితులకు వైద్యం ఎలా అందిస్తున్నారు..? వార్డుల్లో వసతులు ఎలా ఉన్నాయ్..? నిశితంగా పరిశీలించారు. అనంతరం గాంధీ సూపరింటెండెంట్, ఆసుపత్రి సిబ్బందితో కిషన్ రెడ్డి మాట్లాడారు. పలు మార్పులు చేర్పులకు సంబంధించి సూచనలు చేశారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మొర:
ఆస్పత్రి వద్ద కేంద్రమంత్రిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి తమ మొర వినిపించుకున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని.. అలాగే వేతనాలు పెంచాలని కేంద్ర మంత్రికి ఉద్యోగులు వినతిపత్రం అందించారు.
కోవిడ్ సమయంలో ప్రాణాలను పణంగా పెట్టి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి డ్యూటీలకు వస్తున్నామన్నారు. మాకంటే జూనియర్లు కింద మేము పనిచేయలేమని, సమాన పని చేస్తున్నప్పుడు సమాన వేతనం చెల్లించాలని మీడియా ముఖంగా వారు డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించటం భారంగా మారిందని.. తమ వేతనాలు పెంచే వరకు విధులకు హాజరుకామని గాంధీ ఆస్పత్రి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు చెబుతున్నారు.