తెలంగాణలో ఈ నెల 29 వరకూ లాక్‌డౌన్ అమల్లో ఉన్నా... ఇవాళ్టి నుంచి ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు రానున్నారు. గ్రీన్, ఆరెంజ్ జోన్ల పరిధిలో ఉన్న జిల్లాల్లోని ఉద్యోగులంతా విధులకు రావాలని ఆదేశాలు వెళ్లాయి. అందువల్ల జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి ఆఫీసులన్నీ పనిచేస్తాయి.
ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు అందరూ పనిచేస్తారు. ప్రస్తుతం అన్ని జోన్లలో వైద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నారు. ఇవాళ్టి నుంచి రెడ్‌జోన్ జిల్లాల్లో ఈ శాఖల ఉద్యోగులు పూర్తిస్థాయిలో పనిచేస్తారు.
నిబంధనల్ని ఎత్తేస్తోంది. ఇప్పటికే నిర్మాణ, వ్యవసాయ రంగాల వ్యాపారాలు, పరిశ్రమలు, షాపులు తెరవొచ్చని చెప్పింది. ఐతే... ఉదయం 7 నుంచి రాత్రి 6 వరకు షాపులు తెరచుకుంటున్నాయి. ఆ తర్వాత ఉదయం 7 వరకూ కర్ఫ్యూ అమలవుతోంది.