ఈమేరకు రాష్ట్రంలో నిలిచిపోయిన వారి వివరాలను తెలపాల్సిందిగా ఆయా రాష్ర్టాల చీఫ్‌సెక్రటరీలకు లేఖ రాసినట్టు సీఎస్ సోమేశ్‌కుమార్ తెలిపారు. ఈ ప్రక్రియనుపూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒకనోడల్ అధారిటీని ఏర్పాటుచేసినట్టు తెలిపారు. సీనియర్ ఐఎఎస్ అధికారి సందీప్‌కుమార్ సుల్తానియాను నోడల్ అఽధికారిగా నియమించారు.
తెలంగాణలో నిలిచిపోయిన వారిని, వారి రాష్ర్టాలకు తరలించడానికి అవసరమైన రవాణా సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆయా రాష్ర్టాలను కోరినట్టు సోమేశ్‌కుమార్ వివరించారు. అవసరమైన ఏర్పాట్ల కోసం తమ రాష్ర్టాలకు సంబంధించిన నోడల్ అధికారులను తెలంగాణ నోడల్ అథారిటీతో సంప్రదించాలని అన్నారు.