భైరందేవ్ ఆలయంలో అద్భుతం- నిజస్వరూపం అలా బయటపడింది..

గురువారం, 28 సెప్టెంబరు 2023 (18:37 IST)
Lord Bhairam Dev
భైరందేవ్ ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. శతాబ్దాల తర్వాత భైరందేవుడి నిజస్వరూపం భక్తులకు సాక్షాత్కరించింది. నిత్యసింధూరంతో కనిపించే మహాదేవుడు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సదల్ పూర్‌లోకి ఈ ఆలయాన్ని 11వ శత్తాబ్దంలో శాతవాహనులు నిర్మించారు. 
 
9 శతాబ్దాల నుండి సింధూరంతో మాత్రమే దర్శనమిచ్చే మహాదేవుడి నిజరూప దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేస్తూ వచ్చారు. తాజాగా ఆ నిజరూప దర్శనం ఎట్టకేలకు లభించడంతో భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. 
 
ఈ ఆలయంలోని మూర్తి ప్రతి ఏడాది జనవరిలో చందనం పూత పూస్తారు. అలా శతాబ్ధాల తరబడి రాసిన చందనం సింధూరంగా మారింది. అయితే విగ్రహం తల భాగం మీటరు ఎత్తు వరకు పెరగడంతో చందనం పూత కిందపడింది. దీంతో భైరందేవ్ దేవుడి నిజస్వరూపం బయటపడింది. ఈ రూపాన్ని తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు ఆదిలాబాద్ వస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు