బంగాళాఖాతంలో అల్పపీడనం : తెలంగాణాలో 4 రోజుల పాటు వర్షాలు

శనివారం, 10 జులై 2021 (08:30 IST)
గత నాలుగైదు రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మ‌రో నాలుగు రోజుల పాటు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ తెలిపారు. 
 
ఆదివారం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిసా తీరాల దగ్గర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనంతో కొన్నిచోట్ల అతి భారీ వర్షాలు, కొన్నిజిల్లాల్లో భారీ వర్షాలు, చాలాచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
 
మరోవైపు, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద నీరు నిలిచిపోయింది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 529.20 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 166.5892 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు