తెలంగాణా నీటిపారుద‌ల శాఖ జోరు: 879 కొత్త పోస్టులు

శుక్రవారం, 9 జులై 2021 (20:23 IST)
తెలంగాణా నీటి పారుదల శాఖ మంచి జోరుమీద ఉంది. ఆ శాఖ‌లో 879 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ,  ప్రభుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు కొత్త పోస్టుల‌ను ప్ర‌క‌టించారు.

కొత్తగా మంజూరు చేసిన పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (అడ్మిన్‌)ను ఆదేశించారు. భర్తీకి ముందు ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు.

వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎలక్ట్రీషియన్‌లు, ఫిట్టర్లు, పంప్‌ ఆపరేటర్లు, జనరేటర్‌ ఆపరేటర్‌ సహా మొత్తం 11 విభాగాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు 532, ఎలక్ట్రీషియన్లు 109, ఫిట్టర్లు 45, ఫ్లడ్‌ గేట్‌ ఆపరేటర్లు 79, పంప్‌ ఆపరేటర్లు 44, జనరేటర్‌ ఆపరేటర్లు 43, ఇతర పోస్టులు 27 భ‌ర్తీ చేయ‌నున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు