మీరు భూమిపై వున్నారా లేక ఆకాశంలోనా? తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంపై హైకోర్టు అసహనం

గురువారం, 29 ఏప్రియల్ 2021 (15:00 IST)
ఒకవైపు కరోనావైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏంటని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా కోర్టు... ప్రజల ప్రాణాల కన్నా ఎన్నికలు విలువైనవా అంటూ నిలదీసింది.
 
అసలు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా వుందో చూశారా, అసలు మీరు భూమి మీద వున్నారా లేక ఆకాశంలోనా అని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎన్నికలు నిర్వహించేందుకు కొన్ని మునిసిపాలిటీలకు ఇంకా సమయం వుండగానే ఈ మహమ్మారి సమయంలో ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది.
 
రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం ప్రకారం తాము ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమైనట్లు ఎస్ఇసి అధికారులు చెప్పగా, మరి కరోనా రెండో దశ మొదలైన విషయం తెలిసి కూడా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటూ కోర్టు ప్రశ్నించింది. కరోనా కట్టడి సమయంలో ఎన్నికల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు, విచారణకు అధికారులు హాజరు కావాలని ఆదేశించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు