మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. శంషాబాద్‌లో బాలికపై అత్యాచారం ఘటన మరువక ముందే మరో మహిళపై ఆటో డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అప్రమత్తమైన మహిళ తప్పించుకుని శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం గండిగూడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కొత్తూర్ వెళ్లేందుకు గండిగూడ వద్ద ఆటో ఎక్కింది.