రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ భాజపా కార్యక్రమానికి భాజపా శ్రీకారం చుట్టింది. ఒక్కో కార్యకర్త పోలింగ్‌బూత్‌లో వంద కుటుంబాల వద్దకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా కరీంనగర్‌లోని చైతన్యపురి 173వ పోలింగ్ బూత్ పరిధిలోని ప్రజలతో సంజయ్ మమేకమయ్యారు. 9 ఏళ్ల మోడీ పాలనను వివరిస్తూ కరపత్రాలు పంచిపెట్టారు.
కాంగ్రెస్, భారాస కలిసి మొదటి విడతగా 30 మంది అభ్యర్థులను ఎంచుకున్నాయి. వారికి కేసీఆర్ ఫండింగ్ ఇస్తున్నారు. కాంగ్రెస్ లో గెలిస్తే తిరిగి భారాసలోకి రావడానికే ఈ వ్యూహం. కేసీఆర్‌కి భారాస అభ్యర్థుల కంటే కాంగ్రెస్ మీదనే నమ్మకం ఉంది. కాంగ్రెస్‌లో ఉన్నోళ్లందరూ మావాళ్లే అనే ఫీలింగ్‌లో కేసీఆర్ ఉన్నారు అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.