బారు ఒకటి.. దరఖాస్తులు 142... ఎక్కడ?

శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:04 IST)
తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని మద్యంబార్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అంటే.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బార్లు కాకుండా మరో 159 బార్లను అదనంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించి, దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ 159 బార్లకు 8,464 దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం. దరఖాస్తుల నుంచి డ్రా తీసి పేరు వచ్చినవారికి బార్లను కేటాయిస్తారు. 
 
అయితే మంచిర్యాల జిల్లాలోని ల‌క్షెట్టిపేట బార్‌కు 142 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. మంచిర్యాల జిల్లా ప‌రిధిలో బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెట్టిపేట, క్యాతనపల్లి మున్సిపాలిటీల పరిధిలో 10 బార్లకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేయగా చివరి రోజైన మంగళవారం వరకు 513 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.లక్ష చొప్పున ప్రభుత్వానికి రూ.5.13 కోట్ల ఆదాయం సమకూరింది. 
 
లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఒకే ఒక్క బార్‌కు అత్యధికంగా 142 దరఖాస్తులు వచ్చాయి. అలాగే చెన్నూర్‌లో బార్‌కు 125, నస్పూర్‌ మున్సిపాలిటీలో నాలుగు బార్లకు 104 దరఖాస్తులు, క్యాతనపల్లిలో రెండు బార్లకు 122 దరఖాస్తులు, బెల్లంపల్లిలో రెండు బార్లకు 20 దరఖాస్తులు వచ్చాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు