హైదరాబాద్ జీహెచ్ఎంసి పరిధిలోనే గత ఆరునెలల్లో ట్రాఫిక్ రూల్స్ పాటించని వాహనదారులపై భారీ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇక జరిమానా, చలనాలతో ఖజానాలో కాసుల వర్షం కురుస్తుంది. ఇక గత నెల రోజుల నుంచి హైదరాబాద్ పోలీసులు పెండింగ్ ట్రాఫిక్ ఫైన్లు వసూలు చేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్ కేసులతో పాటు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన వాహనదారుల నుంచి జరిమానాలు వసూలు చేస్తున్నారు.
ఆ బైకుపై రూ.1650 చలానా పెండింగ్ ఉందని, చెల్లించాలని ఎస్‌ఐ మహేంద్రనాథ్ కోరారు. అది తప్పుడు చలానా అని న్యాయవాది బదులిచ్చారు. బండిని సీజ్ చేయగా, ఒక్క చలానాకే ఎలా చేస్తారని ఆయన నిలదీశారు. మాదాపూర్ ట్రాఫిక్ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం ఒక్క చలానా పెండింగ్ ఉన్నా సీజ్ చేయొచ్చని స్పష్టం చేశారు.