కేసీఆర్‌కు ఓడిపోతాననే భయం పట్టుకుంది. అందుకే బీజేపీ కార్యకర్తలపై దాడులు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఫైర్ అయ్యారు. అందుకే రాష్ట్రంలో ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయని విజయశాంతి మండిపడ్డారు.
కేసీఆర్‌కు ఓడిపోతాననే భయం పట్టుకుందని ఆమె ఎద్దేవా చేశారు. ప్రతిరోజూ పూర్తి స్థాయిలో రిపోర్టు ఇవ్వాలని అటు ఇంటెలిజెన్స్కు, ఇటు డిపార్ట్మెంట్లకు కేసీఆర్ సర్కార్ నుంచి ఇంటర్నల్ ఆదేశాలు వెళ్లాయని రాములమ్మ చెప్పారు.