నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి పోలీసులు రాఘవపై ఐపీసీ 302, 306, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక వనమాను శనివారం అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆయనపై సస్పెండ్ వేటు వేసింది.
వివరాల్లోకి వెళితే.. శుక్రవారం రాత్రి దమ్మపేట పోలీసులు మందలపల్లి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆంధ్రా ప్రాంతం నుంచి కారులో వస్తున్న రాఘవతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకుడు గిరీశ్, కారు డ్రైవర్ మురళిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పాల్వంచ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.