హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి బ్రేక్.. కోట్ల ఖర్చు తగ్గిందా?

శనివారం, 11 సెప్టెంబరు 2021 (17:10 IST)
హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారానికి బ్రేక్ పడింది. మొన్నటి వరకు హుజురాబాద్‌లో పలు ప్రధాన పార్టీల ప్రచారాల ఒకరికంటే మరొకరికి ధీటుగా ప్రచారం కొనసాగించారు. కాని తెలంగాణా రాష్ట్రాలో ఇప్పట్లో ఉప ఎన్నికలు లేవని తెలపడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హుజురాబాద్ వైపు కన్నెత్తి చూడడం లేదు.  మొన్నటివరకు నాయకుల సందడితో హుజురాబాద్ నియోజకవర్గం కిటకిటలడింది. పండగలు తరువాతే ఎన్నికలు అని ఈసీ తెలపడంతో ఒక్కసారిగా ప్రచారాలకు బ్రేక్ పడింది.
 
నిన్న మొన్నటివరకు ఫంక్షన్ హాల్స్‌ తో పార్టీ నాయకులతో.. పార్టీ జెండాలతో.. ప్రచార వాహనాలతో ఏ రోడ్డు చుసినా కిక్కరిసిన జనాలతో మైకుల సందడి ఉండేది కాని ఇప్పుడు ఎన్నికలు లేవనడంతో ప్రచారాలకు తాత్కాలికంగా బ్రేక్ ఐతే పడింది. గత మూడు నెలల నుండి ప్రచారాలకు, తైలాలకు, ఖర్చు తడిసి మోపేడు కావడంతో, ఇప్పుడు ఎన్నికలకు తాత్కాలిక బ్రేక్ పడడంతో పార్టీలకు నాయకులకు ఖర్చు భారం తగ్గిందని చెపుతున్నారు. మూడు నెలల నుండి పార్టీ కార్యకర్తలకు, ప్రచారాలకు, ఫుడ్, బెడ్, ఇంకా వగైరాలకు ఇప్పటికే కోట్ల రూపాలు ఖర్చు పెట్టినట్లు సమాచారం

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు