బీఆర్ఎస్ ఎమ్మెల్యే కుమార్తెపై కేసు నమోదు.. తండ్రే పెట్టించారంటున్న కుమార్తె

మంగళవారం, 27 జూన్ 2023 (13:16 IST)
తెలంగాణ రాష్ట్రంలోని అధికార భారత రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కుమార్తె తుల్జా భవానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తన భూమి ఫెన్సింగ్‌ను భవానీ కూల్చివేశారంటూ పక్క స్థల యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. దీనిపై తుల్జా భావనీ స్పందిస్తూ, తన తండ్రే ఆయనతో కేసు పెట్టించారని ఆరోపిస్తున్నారు.
 
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే యాదగిరి రెడ్డికి, ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డికి మధ్య గత కొంతకాలంగా భూమికి సంబంధించిన వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో 1270 గజాల స్థలం చుట్టూత ఉన్న ఫెన్సింగ్‌ను తుల్జా భవానీ సోమవారం కూల్చివేశారు. తన పేరుమీద ఉన్న భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను ఆమె కూల్చేవేశామని చెబుతున్నారు. 
 
పైగా, చేర్యాల మున్సిపాలిటీకి తన భూమిని అప్పగించనున్నట్టు ఆమె ప్రకటించారు. అయితే, ఆ భూమి పక్కన ఉన్న తన భూమి ఫెన్సింగ్‌ను కూడా భవానీ కూల్చివేశారంటూ పక్క స్థల యజమాని రాజు భాయ్ చేర్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా చేసుకుని తుల్జా భవానీపై పోలీసులు నమోదు చేశారు. దీనిపై భవానీ స్పందిస్తూ, తన తండ్రి ఒత్తిడి రాజు భాయ్ తనపై ఫిర్యాదు చేసి, పోలీసులు కేసు పెట్టేలా చేశారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు