హైదరాబాద్‌లోని జినోమ్ వ్యాలీలో టీకా పరీక్ష, ధ్రువీకరణ (వాక్సిన్ టెస్టింగ్, సర్టిఫికేషన్) కేంద్రం ఏర్పాటుకోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని పరిశీలించాలని కేంద్ర వైద్య, కుటుంబసంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌కు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు.
టీకా పరీక్ష, ధ్రువీకరణ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలంటూ తెలంగాణ ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. కేంద్ర మంత్రికి లేఖ రాసిన విషయం విదితమే. దీన్ని పత్రికల్లో చదివిన తర్వాత కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్‌తో ఉపరాష్ట్రపతితో మాట్లాడారు.
ప్రపంచంలో ఇటువంటి కేంద్రాలు ఏడు మాత్రమే ఉన్నాయని, అందువల్ల ఈ విషయాన్ని అన్నికోణాల్లో పరిశీలించి నిర్ణయించాల్సిఉంటుందని.. మీ సూచనను ఉన్నతస్థాయిలో పరిశీలిస్తామని ఉపరాష్ట్రపతికి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు.