కరోనాతో సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు బొమ్మెర వెంకటేశం మరణం

బుధవారం, 9 సెప్టెంబరు 2020 (19:12 IST)
కరోనాతో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ బాల్యమిత్రుడు బొమ్మెర వెంకటేశం మరణించారు. కరోనాతో బాధపడుతున్న ఆయన హైదరాబాదులోని వాసవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అతని ఆరోగ్యం విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు.
 
బొమ్మెర వెంకటేశం స్వస్థలం సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మండలం చెర్యాపూర్. వెంకటేశంకు భార్య విజయ, నలుగురు కొడుకులు నాగభూషణం, శ్రీనివాస్, రాజేందర్, ప్రసాద్ ఉన్నారు. వెంకటేశం రైస్ మిల్ అసోషియేషన్ సెక్రటరీగా, చల్లాపూర్ గ్రామ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా, రేకుల మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకమండలిలో సభ్యుడిగా పని చేశారు.
 
ఆయన కేసీఆర్‌కు బాల్యమిత్రుడు. కాళేశ్వర దేవస్థానం చైర్మన్‌గా రెండు పర్యాయాలుగా కొనసాగారు. వెంకటేశం మృతి పట్ల ఆలయ ఈవో మారుతి, అర్చకులు, ఉద్యోగస్తులు సంతాపం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు