కరోనా నుంచి కోలుకున్న సీఎం కేసీఆర్ : తాజా పరీక్షల్లో నెగెటివ్

బుధవారం, 5 మే 2021 (09:08 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనకు తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్ అని వచ్చింది. ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్‌ ఎంవీ రావు ఆధ్వర్యంలోని వైద్య బృందం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించారు. రాపిడ్‌ యాంటీజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా.. రెండింటిలోనూ నెగెటివ్‌గా రిపోర్టులు వచ్చాయి. 
 
కాగా, ముఖ్యమంత్రికి గతనెల 28న నిర్వహించిన యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు మిశ్రమంగా వచ్చాయి. యాంటీజెన్‌ టెస్ట్‌ రిపోర్ట్‌లో నెగెటివ్‌ రాగా, ఆర్టీపీసీఆర్‌ పరీక్ష రిపోర్ట్‌లో ఖచ్చితమైన ఫలితం రాలేదని వైద్యులు తెలిపారు. 
 
వైరస్‌ తగ్గుముఖం పట్టే క్రమంలో ఒక్కోసారి ఖచ్చితమైన ఫలితాలు రావని డాక్టర్‌ ఎంవీ రావు అన్నారు. అయితే రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ రావడంతో సీఎం పూర్తిగా కోలుకున్నట్టేనని వైద్యులు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు