వణికిస్తున్న కరోనాకు తాటి కల్లుతో చెక్?

మంగళవారం, 4 మే 2021 (12:16 IST)
మండు వేసవి కాలంలో లభించే చల్లని పానీయాల్లో తాటి కల్లు ఒకటి. అయితే, కరోనా కష్టకాలంలో ఈ  తాటి కల్లుకు డిమాండ్ ఏర్పడింది. దీనికి కారణం.. తాటి కల్లు తాగితే కరోనా సోకదనే ప్రచారం జోరుగాసాగడమే. తాటి కల్లు తాగితే కరొనా రాదని, గట్టిగా నమ్ముతున్నారు. 
 
దీంతో ఆడామగా అనే తేడా లేకుండా, అలవాటు లేనివారు కూడా తాటి కల్లు తాగేందుకు ఆసక్తి చూపుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో తాటి కల్లు తాగితే క‌రోనా రాదని, తాటికల్లులో వైరస్ కారకాలను చంపేసే ఆయుర్వేద గుణం ఉందని, అందుకే తాటి కల్లు తాగిన వారికి క‌రోనా రావడం లేదని స్థానికులు గట్టిగా నమ్ముతున్నారు.
 
తాటి కల్లు తాగితే కరోనా రాదన్న విషయాన్ని సైంటిస్టులు పత్రికల్లో చెప్పారని అంటున్నారు. తాటి కల్లు ఒక ఆయుర్వేద మందులా పనిచేసే ఔషధ గుణాలున్న దివ్య ఔషధం అని, తాటి కల్లు తాగితే శరీరానికి కూడా ఎంతో మంచిదని ఈ ప్రాంత ప్రజలు నమ్ముతున్నారు. 
 
గీత కార్మికులకు ఫోన్ చేసి మరీ కల్లును బుక్ చేసుకుంటున్నారు స్థానికులు. తాటి కల్లుకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా ఒకరోజు ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. లేదంటే కల్లు దొరకడం లేదని చెబుతున్నారు.
 
కల్లు తాగిన వారికి ఈ ఊరిలో ఎవరికీ కరోనా వైరస్ సోకడం లేదని కూడా స్థానికులు చెబుతున్నారు. ఏది ఏమైనా తాటి కల్లు తాగితే కరోనా పోతుందో, లేదో తెలియదు కానీ తాటి కల్లు తాగితే కరోనా రాదని ఈ ప్రాంత ప్రజలు బలంగా నమ్ముతున్నారు. స్థానికుల నమ్మకం ఎలా ఉన్నా గీత కార్మికులకు మాత్రం బాగా గిరాకీ అవుతుందంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు