ఇందుకోసం బుధవారం ఉదయమే ఢిల్లీకి వెళ్లిన మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో పాటు పలువురు వసంత్ విహార్‌లో తెరాస పార్టీ ఆఫీసుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. పార్టీ ఆఫీసు నిర్మాణ భూమి పూజ కార్యక్రమం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జరగనుందన్నారు. ఇప్పటివరకు ఏ దక్షిణాది పార్టీకి ఢిల్లీలో కార్యాలయం లేదు. ఢిల్లీలో ఆఫీసు ఏర్పాటు చేసుకుంటున్న తొలి దక్షిణాది పార్టీ మాదే అని మంత్రి ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.