రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో దళిత శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాలను ఎంపిక చేసి... ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్‌తో పాటే దళితబంధు అమలు చేయనున్నారు.
ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు అమలు అవుతుండగా... ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలంలో, నాగర్‌కర్నూల్ జిల్లాలోని చారగొండ మండలంలో, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో అమలు చేయాలని సూచించింది.